భారత జట్ల ఓటమి
కింగ్డావో (చైనా): ఆసియా టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షి్‌పలో ఇప్పటికే క్వార్టర్‌ఫైనల్స్‌కు చేరిన భారత జట్లు చివరి గ్రూపు మ్యాచ్‌లలో పరాజయం చవిచూశాయి. మహిళల గ్రూప్ ‘వై’ పోరులో భారత్ 2-3తో థాయ్‌లాండ్ చేతిలో ఓడింది. దాంతో గ్రూపులో రెండో స్థానం లో నిలిచింది. గ్రూప్ ‘సి’లో భారత పురుషులు కూడా 2-3తో జపాన్ చేతిలో ఓటమి పాలై రెండో స్థానంలో నిలిచారు. శుక్రవారం జరిగే క్వార్టర్‌ఫైనల్లో చైనాతో మహిళలు, కొరియాతో పురుషులు తలపడతారు.










Comments