• Jun 13, 2026
  • NPN Log

    హైదరాబాద్‌ : అబ్దుల్లాపూర్‌మెట్‌లోని మామిడి తోటలో యూనిట్‌ ఏర్పాటు చేసి అందులో రహస్యంగా మత్తుమందును తయారుచేస్తున్న.. పాత నేరస్తుల ముఠాలోని ఇద్దరు సభ్యులను ఈగల్‌ ఫోర్స్‌ అరెస్టు చేసింది. వీరి నుంచి రూ.50 లక్షల విలువైన 750 గ్రాముల ఎపిడ్రిన్‌ను ఈగల్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సూర్యాపేటకి చెందిన కీసరి మత్స్యగిరి, అతని మిత్రుడు నిమ్మల నరేష్‌ కొన్నాళ్లుగా ఎపిడ్రిన్‌ తయారు చేస్తున్నారు. 2015లో సాధారణ కెమిస్టుగా జీవితాన్ని ప్రారంభించిన మత్స్యగిరి ఆ తర్వాత గుజరాత్‌కు చెందిన అంతర్రాష్ట్ర మత్తుమందుల తయారీదారులు సంతోష్‌ సింగ్‌, విజయ్‌, అశ్వినిపధక్‌తో చేతులు కలిపాడు. దేశంలోని పలుప్రాంతాల్లో ఎపిడ్రిన్‌ తయారు చేసి విక్రయించాడని ఈగల్‌ డెరెక్టర్‌ సందీప్‌ శాండిల్య తెలిపారు. సంతోష్‌ సింగ్‌ ముఠా మత్తు దందా సరిగా నడవని సమయంలో బంగారునగల షాపుల్లో దోపిడీలకు పాల్పడేవారని తెలిపారు. ఈ కేసులో సంతోష్‌ సింగ్‌, విజయ్‌, ప్రభాకర్‌, అశ్వినిపధక్‌ పరారీలో ఉన్నారని వివరించారు.

     

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement