మ్యాడ్ హీరో.. కొత్త సినిమా షురూ
‘మ్యాడ్’ చిత్రంతో యువ ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరో రామ్ నితిన్ మరో యూత్‌ఫుల్ ఎంటర్టైనర్తో రాబోతున్నారు. కాకినాడలోని ఓ కాలేజ్ బ్యాక్ డ్రాప్లో ఇది తెరకెక్కనుంది. ‘సుందరకాండ’ ఫేమ్ వెంకటేశ్ నిమ్మలపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. వల్లభనేని గిరిబాబు సమర్పణలో ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై ధీరజ్ మొగిలినేని నిర్మిస్తున్నారు.
గురువారం రామ్ నితిన్ పుట్టినరోజును పురస్కరించుకుని ఈ సినిమాకు సంబంధించిన స్పెషల్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. కలర్‌ఫుల్ కాలేజ్ ఫెస్ట్ వైబ్స్‌తో పోస్టర్ ఆకట్టుకుంటోంది. ‘ఫన్, ఫెస్ట్, కెయాస్... బిగిన్స్ సూన్’ అంటూ పోస్టర్లో పెట్టిన క్యాప్షన్ ఈ సినిమా మంచి వినోదాత్మకంగా ఉండబోతోందని తెలియజేస్తోంది.









Comments