మా ఓటమికి కారణం అతడే..!
భారత్‌తో జరిగిన రెండో టీ-20 లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. ఆసీస్ బౌలర్లు విరుచుపడిన వేళ టీమిండియా బ్యాటర్లు చేతులెత్తేశారు. మెల్‌బోర్న్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన ఆసీస్ నాలుగు వికెట్ల తేడాతో భారత్‌ను చిత్తు చేసింది. 13.2 ఓవర్లలోనే అలవోక విజయాన్ని నమోదు చేసింది.
అంతా అతడి వల్లే..
అనంతరం తమ పరాజయంపై కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్మా ట్లాడాడు. ‘జోష్ హేజిల్‌వుడ్ కారణంగానే ఈ మ్యాచ్ ఓడిపోయాం. అతడు చాలా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. పవర్ ప్లేలోనే నాలుగు వికెట్లు తీసి మమ్మల్ని కోలుకోలేని దెబ్బ తీశాడు. అభిషేక్ శర్మ మినహా నాతో సహా మిగతా బ్యాటర్లంతా హేజిల్‌వుడ్ బౌలింగ్‌లో చేతులెత్తుశారు. అభిషేక్ శర్మ మంచి నాక్ ఆడాడు. అతడికి తన ఆట పట్ల ఓ క్లారిటీ ఉంది. అన్ని మ్యాచ్‌ల్లోనూ ఇదే జోరు కొనసాగిస్తాడని ఆశిస్తున్నాం. టాస్ మమ్మల్ని అన్నిసార్లూ నిరాశపరుస్తోంది. ముందుగా బ్యాటింగ్ చేస్తే భారీ లక్ష్యాన్ని నిర్దేశించాలి. ఆపై ఫీల్డింగ్‌లో ఆ స్కోరుని కాపాడుకోవాలి. మేం ఈ రెండు చేయలేకపోయాం. అందుకే ఓడిపోయాం’ అని సూర్య వ్యాఖ్యానించాడు.
 
                     
                              
  








 
 
Comments