• Apr 01, 2026
  • NPN Log

    అమెరికాలో మరో భారతీయ సంతతి మహిళ కీలక పదవిని చేపట్టింది. యూఎస్ఏ కార్మికశాఖ ముఖ్య సమాచార అధికారి(సీఐవో) భారత సంతతికి చెందిన టెక్నాలజీ నిపుణురాలు మంగళ కుప్పా నియమితులయ్యారు. గతేడాది అక్టోబరు నుంచి తాత్కాలిక హోదాలో పనిచేసిన ఆమెకు పూర్తి స్థాయి సీఐవో బాధ్యతలు అప్పగించారు. కార్మిక శాఖ విభాగానికి కృత్రిమ మేధస్సు(ఏఐ) అధికారిగా కొప్పా మార్చి నెల ప్రారంభంలో నియమితులయ్యారు. ఆమె కార్మిక విభాగంలో సమాచార సాంకేతిక వ్యూహం, డిజిటల్ పరివర్తన, ఏఐ వినియోగాన్ని పర్యవేక్షిస్తారు. 'సేవను కొనసాగిస్తూ, మార్పు తీసుకువచ్చే అవకాశం లభించినందుకు కృతజ్ఞతతో ఉన్నాను' అని కుప్పా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

    టెక్నాలజీ ఎగ్జిక్యూటివ్‌గా పని చేసిన కుప్పాకు 25 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. 2010లో కార్మిక శాఖలో చేరారు. అప్పటి నుంచి చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్, డైరెక్టర్‌ ఆఫ్‌ బిజినెస్‌ అప్లికేషన్‌ సర్వీసెస్‌ వంటి పలు ఉన్నత పదవులను నిర్వహించారు. ఎంటర్‌ప్రైజ్ ఏఐ వ్యూహాన్ని అభివృద్ధి చేయడం, డేటా ప్లాట్‌ ఫారమ్‌లను విస్తరించడం, సైబర్‌ సెక్యూరిటీ వ్యవస్థలను బలోపేతం చేయడంలో ఆమె కీలక పాత్ర పోషించారు. ఎస్ఎన్డీటి మహిళా విశ్వవిద్యాలయంలో చదువుకున్న కుప్పా, యూఎస్ ప్రభుత్వంలోని కీలక టెక్నాలజీ నాయకత్వ పాత్రలలో భారతీయ సంతతికి చెందిన నిపుణుల పెరుగుతున్న ప్రాతినిధ్యానికి నిదర్శనంగా నిలిచారు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement