• Apr 01, 2026
  • NPN Log

    పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ యుద్ధాన్ని వీలైనంత త్వరగా ముగించాలని అమెరికా భావిస్తోంది. అయితే ఇరాన్ మాత్రం అమెరికాతో శాంతి చర్చలకు సుముఖంగా ఉన్నట్టు కనిపించడం లేదు. దీంతో పశ్చిమాసియాలో పరస్పర దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో వైట్‌హౌస్ కీలక ప్రకటన చేసింది. బుధవారం రాత్రి 9 గంటలకు (అమెరికా కాలమానం ప్రకారం) డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రసంగం చేయనున్నారని తెలిపింది.

    'వినండి.. అధ్యక్షుడు ట్రంప్ బుధవారం రాత్రి 9 గంటలకు (ఈటీ) ఇరాన్‌పై ఒక ముఖ్యమైన తాజా సమాచారాన్ని అందించనున్నారు. దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు' అని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ తెలిపారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో, ప్రభుత్వం తీసుకోబోయే తదుపరి చర్యలను ఈ ప్రైమ్‌టైమ్ ప్రసంగంలో వివరించే అవకాశం ఉంది.

    కాగా, హోర్ముజ్ జలసంధిని ఇరాన్ పూర్తిగా తెరవకపోయినా, సైనిక చర్యను ముగించడానికి తాను సిద్ధంగా ఉన్నానని ట్రంప్ సంకేతాలు ఇచ్చారు (US Iran war update). ఈ మార్గాన్ని తిరిగి తెరవడానికి అనుకున్నదానికంటే ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉందని ట్రంప్ భావిస్తున్నారు. హోర్ముజ్‌ తిరిగి తెరుచుకోవడానికి నాలుగు నుంచి ఆరు వారాల సమయం పట్టవచ్చని ఆయన అంచనా వేస్తున్నారు.
     

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement