యజ్ఞంలా కోటి సంతకాల సేకరణ: వైసీపీ
ఆంధ్రప్రదేశ్ : రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మాజీ సీఎం జగన్ చేపట్టిన కోటి సంతకాల సేకరణ యజ్ఞంలా సాగుతోందని వైసీపీ ట్వీట్ చేసింది. ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొంటున్నారంది. పార్టీ నేతలు YS అవినాశ్‌రెడ్డి, YS మనోహర్‌రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి ఆధ్వర్యంలో గ్రామ గ్రామాన కార్యక్రమం జరుగుతోందని పేర్కొంది. ప్రైవేటీకరణతో ప్రజలకు కలిగే నష్టాలను వివరిస్తూ సంతకాలు సేకరిస్తున్నారంది.










Comments