రానున్న 24గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు
ఆంధ్రప్రదేశ్ : నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోందని, రానున్న 12 గంటల్లో పశ్చిమ వాయవ్య దిశలో పయనించి వాయుగుండంగా మారుతుందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, కడప, అన్నమయ్య జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని చెప్పింది. అటు భారీ వర్షసూచన నేపథ్యంలో రేపు కూడా నెల్లూరు జిల్లాలోని స్కూళ్లకు కలెక్టర్ సెలవు ప్రకటించారు.
Comments