తిరుమలలో కొనసాగుతున్న రద్దీ
ఆంధ్ర ప్రదేశ్ : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకు భక్తులు క్యూలైన్‌లో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 18 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు తెలిపారు. అటు నిన్న 72,026 మంది స్వామి వారిని దర్శించుకున్నట్లు చెప్పారు. 23,304 మంది తలనీలాలు సమర్పించారన్నారు. హుండీ కానుకల ద్వారా రూ.3.86 కోట్ల ఆదాయం వచ్చిందని వెల్లడించారు.
Comments