రేయ్ .. కొట్టొద్దురా.. ఫ్యాన్స్ రా.. పాపంరా
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సినిమాలు, నటన అన్ని పక్కన పెడితే.. డార్లింగ్ అంత మంచి మనసు ఇండస్ట్రీలో ఎవరికి లేదు అని చెప్పడంలో అతిశయోక్తే లేదు. ఇప్పటివరకు ప్రభాస్ కు ఇండస్ట్రీలో ఒక్క నెగిటివ్ వివాదం లేదు. అప్పుడప్పుడు ఆ హీరోయిన్ తో పెళ్లి.. ఈ హీరోయిన్ తో ప్రేమ లాంటి పుకార్లు తప్ప.. ఏ వివాదంలో జోక్యం చేసుకోవడం కానీ, అనవసరముగా సోషల్ మీడియాలో మాట్లాడడం కానీ ఇప్పటివరకు జరగలేదు.
ఇండస్ట్రీలో చిన్నా,. పెద్దా.. ముసలి, ముతకా అనే తేడా లేకుండా అందరినీ డార్లింగ్ అని పిలవడం ప్రభాస్ కి అలవాటు. ఇక ప్రభాస్ మితభాషి అన్న విషయం అందరికీ తెల్సిందే. ఇంటోవర్ట్. ఎవరితో ఎక్కువ మాట్లాడాడు. వేదికల మీద, స్పీచ్ లు ఇవ్వడం , జనాల్లో తిరగడం ఇలాంటి వాటికి డార్లింగ్ దూరం. కానీ, ఫ్యాన్స్ ను మాత్రం సొంత కుటుంబ సభ్యులుగా భావిస్తాడు. వారి కోసం ఎక్కువ ఆలోచిస్తాడు.
తాజాగా బాహుబలి ది ఎపిక్ ప్రమోషన్స్ లో భాగంగా ప్రభాస్, రానా దగ్గుబాటి, రాజమౌళి కలిసి ఒక స్పెషల్ ఇంటర్వ్యూ చేశారు. అప్పటి బాహుబలి ముచ్చట్లను మరోసారి గుర్తుచేసుకున్నారు. ఇక బాహుబలి మొదటి షూటింగ్ కర్నూల్ లో జరిగింది. అక్కడ ప్రభాస్ ను చూడడానికి ఫ్యాన్ కోకొల్లలుగా వచ్చారు. ఆ సమయంలో కొండా మీద నుంచి గుర్రాల మీద కిందకు వచ్చినట్లు ప్రభాస్ గుర్తుచేసుకున్నాడు. అలానే రానా తమ కారు కాకుండా రోడ్డు మీద వెళ్లే కారు ఆపి.. నేను, ప్రభాస్, రాజమౌళి నీ కారు ఎక్కుతాం.. నీకు ఓకేనా అడిగాడని, అతను షాక్ అయ్యి అలానే చూసినట్లు తెలిపాడు.
ఇక ఆ తరువాత తమ కారులో బయల్దేరుతుంటే కార్తికేయ. ఒక పోలీస్ పెద్ద లాఠీలు తీసుకొని జనాలను కంట్రోల్ చేస్తూ కారు మూవ్ అయ్యేలా చేస్తున్నారని, అది చూసిన ప్రభాస్.. రేయ్ .. కొట్టొద్దురా.. ఫ్యాన్స్ రా.. పాపంరా .. ఆపమని చెప్పండ్రా అని అన్నాడని, దానికి రానా సరే ఊరుకో .. ఊరుకో అని ఆపినట్లు రాజమౌళి గుర్తుచేసుకున్నాడు. దీంతో ఫ్యాన్స్ అంటే డార్లింగ్ ఎంత ప్రేమనే మరోసారి రుజువయ్యిందని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. డార్లింగ్ మనసు వెన్న అంటూ ఫ్యాన్స్ మురిసిపోతున్నారు.








Comments