విద్యార్థులకు అలర్ట్.. ఆధార్ అప్డేట్ కోసం స్పెషల్ క్యాంపులు
ఆంధ్రప్రదేశ్ : ఉచితంగా ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ కోసం స్వర్ణ గ్రామ-స్వర్ణ వార్డులు, అంగన్వాడీల్లో ప్రభుత్వం స్పెషల్ క్యాంపులు నిర్వహించనుంది. తొలి విడతలో ఈ నెల 15 నుంచి 18 వరకు, రెండో విడతలో ఈ నెల 21 నుంచి 24 వరకు అవకాశం ఉంటుంది. బయోమెట్రిక్ అప్డేట్ లేకపోతే విద్యార్థులకు ప్రభుత్వ పథకాలు, స్కాలర్షిప్లు అందడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 12.09 లక్షల మంది తమ డేటాను అప్డేట్ చేసుకోవాల్సి ఉంది.









Comments