గొంతులో మాంసం ముక్క ఇరుక్కొని వ్యక్తి మృతి
తెలంగాణ : గొంతులో మాంసం ఇరుక్కొని ఊపిరాడక ఓ వ్యక్తి మృతి చెందారు. మహబూబాబాద్ జిల్లా దామరవంచ శివారు పిల్లిగుండ్లతండాకు చెందిన బానోతు బిచ్చా(54) తన ఇంట్లో దుర్గమ్మ పండగ చేసుకున్నారు. ఈ క్రమంలో రాత్రి భోజనం చేస్తున్న సమయంలో గొంతులో మాంసపు ముక్క ఇరుక్కుంది. ఊపిరాడక విలవిల్లాడిన బిచ్చాను కుటుంబ సభ్యులు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కానీ ఆయన అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు చెప్పారు.









Comments