విష్ణు వామనావతారం ఎందుకు ఎత్తాడు?
దానశీలి బలి చక్రవర్తి అపారమైన యాగబలంతో ఇంద్ర పదవిని ఆక్రమించి 3 లోకాలపై ఆధిపత్యాన్ని సాధించాడు. ఇది లోకాల సమతుల్యతను దెబ్బతీయడంతో పాటు దేవతల్లో ఆందోళన పెంచింది. అందుకే విష్ణువు, బలి దానగుణాన్ని గౌరవిస్తూనే, అతని అహంకారాన్ని అణచడానికి, లోకాలను రక్షించడానికి వామనుడి రూపంలో వచ్చాడు. కేవలం మూడడుగుల నేల అడిగి, బలిని పాతాళానికి పంపాడు. సద్గుణాలకు మెచ్చి ఆ లోకానికి రాజుగా చేసి, ధర్మాన్ని నిలబెట్టాడు.
Comments