సీఎంను కలిసిన కొత్త సీఎస్ సాయిప్రసాద్
అమరావతి : ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా శనివారం బాధ్యతలు స్వీకరించిన జి.సాయిప్రసాద్ ఆదివారం ముఖ్యమంత్రి చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. ఉదయం సీఎం క్యాంప్ కార్యాలయానికి వెళ్లిన ఆయన సీఎంకు పుష్ఫగుచ్ఛం అందించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. సీఎస్‌తో పాటు సీఎంకు ఎక్స్ అఫిషియో స్పెషల్ సీఎ్‌సగా నియమితులైన విజయానంద్ కూడా ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా ముందుకు వెళ్లాలని సీఎం సూచించారు.









Comments