సీఎం ఆలోచనలతో నీటినిల్వలు పెరిగాయి: నిమ్మల
ఆంధ్రప్రదేశ్ : సీఎం చంద్రబాబు ఆలోచనలు సత్ఫలితాలిచ్చాయని మంత్రి నిమ్మల తెలిపారు. ‘గతేడాదితో పోల్చితే వర్షపాతం తక్కువైనా భూగర్భజలాలు, రిజర్వాయర్లలో నీటినిల్వలు ఉన్నాయంటే సీఎం వాటర్ మేనేజ్మెంట్ వల్లే సాధ్యమైంది. తుంగభద్ర, శ్రీశైలం, కాటన్ బ్యారేజ్, గోరకల్లు రిజర్వాయర్, హంద్రీనీవా ప్రాజెక్టులకు నిధులు కేటాయించారు. ఐదేళ్లలో చేయలేని పనిని ఒక్క ఏడాదిలోనే చేశారు. కరవు లేకుండా చేయడమే సీఎం లక్ష్యం’ అని స్పష్టం చేశారు.
Comments