ఓటు చోరీ చేసి ప్రజాస్వామ్యంపై కత్తి పెట్టిన బీజేపీ
దేశ ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు, ఓటు హక్కును కాపాడేందుకు జరుగుతున్న ఓటు చోరీ ఉద్యమం. ఈ సందర్భంగా ఈ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా బిజెపి పార్టీ ఓటు చోరీ చేస్తున్న దాన్ని మన నాయకులు వెలికితీసి, ప్రజల ముందు పెట్టారన్నారు. ఇది కేవలం ముగ్గురు నాయకుల అరెస్టు కాదని,ఇది దేశ ప్రజల హక్కులపై దాడనీ అన్నారు. ఇది రాజ్యాంగంపై దాడని ఇది మా స్వరాన్ని అణగదొక్కడానికి చేసిన కుట్ర అని విమర్శించారు. బిజెపి ప్రభుత్వం, ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసి, నియంతృత్వాన్ని పెంచుకోవాలని చూస్తోందనీ, ఓటు హక్కు కోసం అడిగిన నాయకులను జైలుకు పంపించడం ఇది ప్రజాస్వామ్యంలో ఎప్పటికీ సహించరాని నేరమని తెలిపారు. దేశంలో ప్రతిపక్షాన్ని అణగదొక్కి ప్రజల స్వరాన్ని మూయాలన్న బీజేపీ కుట్రలు ఎప్పటికీ సఫలం కావని, కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం, రాజ్యాంగం కోసం చివరి శ్వాస వరకు పోరాడుతుందని ధృడంగా తెలిపారు. ఓటు హక్కును కాపాడటమే నిజమైన దేశభక్తని, ఈ పోరాటం రాబోయే రోజుల్లో మరింత ఉధృతం కానుందని హెచ్చరించారు. సత్యాన్ని ఎప్పటికీ అణచలేరని, సత్యం ఎప్పటికీ గెలుస్తుందనీ తెలిపారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడే పోరాటంలో కాంగ్రెస్ పార్టీ పార్టీ వెనుకడుగు వేయదని, ఓటు హక్కు కాపాడే వరకు ఈ ఉద్యమం కొనసాగుతుందని పేర్కొన్నారు.
Comments