• Sep 10, 2025
  • NPN Log

    పేద కుటుంబంలో పుట్టినప్పటికీ..కష్టపడి చదువుతూ..విద్యార్థి దశలోనే విద్యారంగ సమస్యలపై పోరాడేందుకు నేషనల్ స్టూడెంట్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎన్ ఎస్ యు ఐ)లో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, నాటి పీసీసీ అధ్యక్షుడు..నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన స్ఫూర్తితో ఎన్ ఎస్ యు ఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ నేతృత్వంలో రాజకీయరంగ ప్రవేశం చేశాడు. అనతి కాలంలోనే ఎన్ ఎస్ యు ఐ హన్మకొండ వాగ్దేవి కాలేజీ ఇన్చార్జిగా బాధ్యతలు చేపట్టి..కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై ధర్నాలు, రాస్తారోకోలు లాంటి అనేక కార్యక్రమాలు చేసి విద్యారంగ సమస్యలను పరిష్కరించేవాడు. ప్రభుత్వం విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్స్, స్కాలర్షిప్ బకాయిలు సకాలంలో మంజూరి చేసేలా..ప్రభుత్వ అధికారులపై ఒత్తిడి తెచ్చేవాడు. ఈ క్రమంలో అతనిని పోలీసులు ఎన్నో మార్లు అరెస్టులు కూడా చేశారు. అయినప్పటికీ పోలీసుల అరెస్టులకు బెదరకుండా నిరంతరం విద్యారంగ సమస్యలపై పోరాడే వాడు. కరోనా కష్ట సమయంలో కూడా విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు నిర్వహించాలని ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడం, ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కళాశాలల్లో ఎన్ ఎస్ యు ఐ సభ్యత్వాలు చేయడం లాంటి కార్యక్రమాలతో పాటు పలు విద్యాసంస్థల్లో పర్యటించి విద్యారంగ సమస్యలపై గళమెత్తేవాడు. 2018 లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినప్పటికీ..అధికారం ప్రత్యర్థి పార్టీల ఒత్తిడీలు ఎక్కువైనప్పటికీ..జంకక, గొంకక.. ఎన్ ఎస్ యు ఐ బలోపితానికి కృషి చేసేవాడు. ఆయన పట్టుదలను చూసి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం 2020 డిసెంబర్ 5న జరిగిన భూపాలపల్లి యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడిగా నిలబెట్టి 1474 ఓట్ల మెజార్టీతో గెలిపించింది. అప్పటి నుండి యువత సమస్యలపై పోరాడుతూనే, విద్యారంగ సమస్యలపై నిరంతరం ఉద్యమాలు కొనసాగిస్తుండేవాడు. రైతులు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై నిత్యం ధర్నాలు చేస్తుండేవాడు. కరోనా సమయంలో ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా పాఠశాలలను ఐసోలేషన్ సెంటర్లుగా మార్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి ప్రజల మన్ననలు పొందాడు. జర్నలిస్టులను కరోనా వారియర్స్ గా ప్రకటించాలని డిమాండ్ చేయడం, రైతులు నష్టపోకుండా వడ్లను త్వరగా కొనుగోలు చేయాలని కొనుగోలు చేయాలని ధర్నాలు చేయడం, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించాలని ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడం, కరోనా సమయంలో ఇంటర్ విద్యార్థులను పాస్ చేయాలని డిమాండ్ చేయడం లాంటి కార్యక్రమాలతో ఉద్యమాల సూర్యుడిగా యార అజయ్ రెడ్డి పేరు ప్రఖ్యాతులు గాంచారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా తాను బ్లడ్ డొనేషన్ చేస్తూ..మరికొంత మంది యువతను ప్రోత్సహించేవాడు. నాటి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో..భూపాలపల్లి నియోజకవర్గానికి ఏ అధికార నాయకుడు పర్యటనకు వచ్చిన నిడదీస్తాడని యార అజయ్ రెడ్డిని ముందస్తు అరెస్టు చేయడం గమనార్హం. నాటి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నాయకత్వంలో అనేక ఉద్యమాల్లో పాల్గొనడం ఆయన ప్రత్యేకత. కల్తీ విత్తనాలతో ప్రజలు నష్టపోతున్నారనే కోణంతో రైతుల పక్షాన పోరాటం చేయడం. మొగుళ్లపల్లి మండలంలోని ఎస్సీ, బీసీ హాస్టల్ లను సందర్శించి వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయడం..2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో గండ్ర సత్యనారాయణ రావు గెలుపే లక్ష్యంగా పనిచేయడం, 2024లో జరిగిన ఎంపీ ఎలక్షన్ లో కడియం కావ్య గెలుపులో క్రియాశీలక పాత్ర పోషించడం, ప్రజా ప్రభుత్వంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను నిరుపేద ప్రజలకు అందే విధంగా చూడడంలో ఆయనది కీలక పాత్ర. ఎన్ని ఒత్తిడీలు వచ్చిన నమ్మిన సిద్ధాంతం కోసం..పేద ప్రజల సంక్షేమం కోసం..నిరంతరం శ్రమించే యార అజయ్ రెడ్డికి ఏదైనా నామినేటెడ్ పదవిని అప్పగించి..ప్రజలకు మరింత సేవలు చేసేలా..కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకోవాలని భూపాలపల్లి నియోజకవర్గంలోని పలువురు ఆయన అభిమానులు, కాంగ్రెస్ పార్టీ వాదులు, మేధావులు కోరుతున్నారు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement