హైవే పై వాహనాలను పార్క్ చేస్తే కఠిన చర్యలు తప్పవు - ఎస్.ఐ. శివ కుమార్
అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం రాజవొమ్మంగిమండలం రాజవొమ్మంగి పోలీస్ స్టేషన్ పరిధిలోని హైవేపై వాహనాలను అడ్డదిడ్డంగా పార్క్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాజవొమ్మంగిఎస్సై శివకుమార్ హెచ్చరించారు. అల్లూరి సీతారామరాజు జంక్షన్ లోని దుకాణాల యజమానులతో ఆయన సమావేశం నిర్వహించి, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైవే పక్కన దుకాణాలకు వచ్చే కస్టమర్లు వారి వాహనాలను ఇష్టమొచ్చినట్లు హైవే పైనే పార్క్ చేసి ట్రాఫిక్కు అంతరాయం కలిగిస్తున్నారని, దీని వల్ల ట్రాఫిక్ కు అంతరాయం, ప్రమాదాలుజరుగుతున్నాయని అన్నారు ఈ సమస్యను నివారించడానికి దుకాణదారులదే బాధ్యత అని, వారి దుకాణాలకు వచ్చే కస్టమర్ల వాహనాలను సరైన పద్ధతిలో పార్క్ చేసేలా చూడాలని, ఈ విషయంలో షాపుల యజమానులు పోలీసులకు సహకరించి తమ కస్టమర్లు వారి వాహనాలను సరైన స్థలంలో పార్క్ చేసేలా చూడాలని ఎస్ఐ శివకుమార్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో పాల్గొన్న దుకాణదారుల యజమానులు ఈ సూచనలను పాటిస్తామని, ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు పోలీసులకు సహకరిస్తామని హామీ ఇచ్చారు.
Comments