11 నెలల్లో రూ.918.59 కోట్ల విరాళాలు
ఆంధ్రప్రదేశ్ : తిరుమల శ్రీవారి ట్రస్టులకు గత 11 నెలల్లో రూ.918.59 కోట్ల విరాళాలు వచ్చాయి. ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.338.8 కోట్లు, శ్రీవాణి ట్రస్టుకు రూ.252.83 కోట్లు, ఎస్వీ ఆరోగ్య వరప్రసాదిని స్కీంకు రూ.97.97 కోట్లు, ప్రాణదానం ట్రస్టుకు రూ.66.53 కోట్లు, గోసంరక్షణకు రూ.56.77 కోట్లు, విద్యాదానం ట్రస్టుకు రూ.33.47 కోట్లను దాతలు అందించారు. ఆన్లైన్లో రూ.579.38 కోట్లు, ఆఫ్లైన్లో రూ.339.2 కోట్లు వచ్చాయి.
Comments