409 పరుగుల భారీ స్కోరు ఆసీస్ అదుర్
హోబర్ట్: కెరీర్ ఆఖరి వన్డేలో అలీసా హీలీ (158) చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడగా, బేత్ మూనీ (106 నాటౌట్) అజేయ సెంచరీతో అదరగొట్టిన వేళ..భారత్‌తో వన్డే సిరీ్‌సను ఆస్ట్రేలియా మహిళలు క్లీన్‌స్వీ్‌ప చేశారు. ఆదివారం జరిగిన మూడో మ్యాచ్‌లో కంగారూలు 185 పరుగులతో వరల్డ్ చాంపియన్ భారత్‌ను చిత్తు చేశారు. అంతేకాదు..ఏకైక టెస్ట్ మ్యాచ్ మిగిలుండగానే ఈ మల్టీ ఫార్మాట్ సిరీ్‌సలో 8-4తో ట్రోఫీని నిలబెట్టుకున్నారు. 2021లో చివరిసారి మల్టీఫార్మాట్ సిరీ్‌సనూ ఆసీస్ మహిళలు సొంతం చేసుకున్నారు. ఇక..మ్యాచ్‌లో మొదట ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 409/7 స్కోరు చేసింది. హీలీ, మూనీకి తోడు జార్జియా వాల్ (62) సత్తా చాటింది. వాల్‌తో కలిసి రెండో వికెట్‌కు 104 పరుగులు జోడించిన హీలీ..మూనీతో కలిసి మూడో వికెట్‌కు 145 (92 బంతులు) రన్స్ జత చేసింది. భారీ ఛేదనలో భారత్ 45.1 ఓవర్లలో 224 పరుగులకే కుప్పకూలింది. స్నేహ్ రాణా (44), జెమీమా (42) కూడా విఫలమైతే మనోళ్ల పరిస్థితి మరీ దారుణంగా ఉండేది. అలనా కింగ్ నాలుగు, వార్హెమ్ రెండు వికెట్లు సాధించారు. ఈ విజయంతో గత వన్డే వరల్డ్ కప్ సెమీ్‌సలో హర్మన్‌ప్రీత్ సేన చేతిలో ఓటమికి ఆస్ట్రేలియా బదులు తీర్చుకుంది. హీలీ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచింది. కాగా వన్డేల్లో అత్యధిక స్కోరు న్యూజిలాండ్ (2018లో 491/4) పేరిట ఉంది.









Comments