7 నెలల గర్భవతి145 కిలోలు ఎత్తి
న్యూఢిల్లీ: సంకల్ప బలం ఉండాలేగానీ.. సాధ్యం కానిదేమీలేదని ఓ కానిస్టేబుల్ నిరూపించింది. ఏడు నెలల గర్భిణి అయినా.. పోటీల్లో పాల్గొని ఏకంగా 145 కిలోల బరువునెత్తి ఔరా అనిపించింది. అమరావతిలోని విట్ విశ్వవిద్యాలయంలో జరిగిన అఖిల భారత పోలీస్ వెయిట్ లిఫ్టింగ్ క్లస్టర్‌లో ఢిల్లీ కానిస్టేబుల్ సోనికా యాదవ్ ఈ ఫీట్ చేసింది. పవర్ లిఫ్టింగ్‌లోని స్క్వాట్స్‌లో 125 కిలోలు ఎత్తిన సోనిక.. బెంచ్ ప్రెస్‌లో 80 కిలోలు, డెడ్ లిఫ్ట్‌లో 145 కిలోలు ఎత్తి కాంస్యం సాధించింది. లూసీ మార్టిన్స్ అనే లిఫ్టర్ గర్భిణిగా ఇలాంటి ఫీట్ చేసినట్టు తాను నెట్‌లో వెదికి తెలుసుకొన్నట్టు యాదవ్ చెప్పింది. సోషల్ మీడియాలో మార్టిన్స్‌ను వెదికి ఆమె సూచనలు, సలహాలతో సాధన చేసినట్టు తెలిపింది. ప్రతి విషయంలోనూ డాక్టర్ల సలహాలను పాటించినట్టు పేర్కొంది.








Comments