రికార్డు స్వర్ణం
మనామా (బహ్రెయిన్): ఆసియా యూత్ క్రీడల్లో భారత లిఫ్టర్ ప్రీతిస్మిత బోయ్ ప్రపంచ రికార్డుతో పసిడి పతకం సాధించింది. బాలికల 44 కిలోల కేటగిరీలో 16 ఏళ్ల ప్రీతిస్మిత మొత్తం 158 (66+92) కిలోల బరువునెత్తి అగ్రస్థానంలో నిలిచింది. కాగా, క్లీన్ అండ్ జర్క్‌లో 92 కిలోల బరువునెత్తిన బోయ్ యూత్ క్రీడల్లో ప్రపంచ రికార్డుతో పసిడి దక్కించుకోగా.. స్నాచ్‌లో 66 కిలోలు లిఫ్ట్ చేసి రజతం సొంతం చేసుకొంది. చైనా అథ్లెట్ వు జిహోంగ్ 156 (68+88) కిలోలతో రజతం, వియత్నాం లిఫ్టర్ దావో తి యన్ 141 (64+77) కిలోలతో కాంస్యం సాధించారు.








Comments