• Mar 02, 2026
  • NPN Log

    అమరావతి : ఆయుష్‌ శాఖలో వైద్యుల పోస్టుల భర్తీ త్వరలో జరగనుందని, ఆయుర్వేద, యునాని, హోమియో కేటగిరిలో కాంట్రాక్టు పద్ధతిన 72 పోస్టుల భర్తీకి సిద్ధం అయినట్లు ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి విడుదల చేసిన నోటిఫికేషన్‌కు భారీగా స్పందన వచ్చిందని, 2,430 మంది అభ్యర్ధులు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. వీటితోపాలు 286 పారా మెడికల్‌, ఇతర పోస్టులను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేస్తామన్నారు. ఆయుర్వేద డిస్పెన్సరీలు, ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ గురించి సీఎం చంద్రబాబుకు వివరించగా ఆయన పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపారన్నారు. ఏపీ మెడికల్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు నియామక నోటిఫికేషన్‌ జారీ చేయగా 2,430 మంది వైద్యులు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. ఆయుర్వేద విభాగంలో 1,086 మంది, హోమియో విభాగంలో 1,219 మంది, యునాని విభాగంలో 125 మంది దరఖాస్తు చేసినట్లు తెలిపారు. వీరందరికి మెరిట్‌ ఆధారంగా పోస్టింగ్స్‌ ఇస్తామన్నారు.


     

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement