ఏపీ నిట్ డైరెక్టర్ ఎప్పుడొస్తారో
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని ఏపీ నిట్ డైరెక్టర్ పదవికి పోటీ తీవ్రంగా ఉంది. ఈ పోస్టు కోసం కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్‌కు స్పందనగా 85 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ జాబితాలో హైదరాబాద్, తిరుపతి ఐఐటీల ప్రొఫెసర్లతో పాటు వరంగల్ నిట్‌కు చెందిన ప్రొఫెసర్లు కూడా ఉన్నారు. వీరికి కేంద్రం ఇంటర్వ్యూలు నిర్వహించిన తర్వాత ముగ్గురి పేర్లను రాష్ట్రపతికి పంపనుంది. అందులో ఒకరిని నిట్ డైరెక్టర్‌గా ముర్ము నియమిస్తారు. అయితే కేంద్రం నోటిఫికేషన్ జారీచేసి ఏడాది గడిచిపోతున్నా నియామక ప్రక్రియ అడుగు కూడా ముందుకు పడలేదు. డైరెక్టర్ పోస్టు ఖాళీగా ఉండటంతో నిట్ తీవ్రంగా నష్టపోతోంది. గత మూడేళ్ల నుంచి నిట్‌లో బీటెక్ సీట్లను కుదిస్తూ వస్తున్నారు. ఒక దశలో 750 సీట్లకు చేరిన నిట్ ఇప్పుడు 480కి పరిమితమైంది. తాజాగా ఇన్‌చార్జి డైరెక్టర్ పదవీ కాలాన్ని మరో 3నెలలు పొడిగించారు. ఈలోగా రెగ్యులర్ డైరెక్టర్ పోస్టును భర్తీ చేయాలని విద్యార్థులు కోరుతున్నారు.
Comments