150 లిక్కర్ షాపులకు ఏపీ మహిళ దరఖాస్తు
తెలంగాణ : మద్యం షాపుల దరఖాస్తులు నేటితో ముగిశాయి. మొత్తం 90వేలకు పైగా అప్లికేషన్లు వచ్చినట్టు తెలుస్తోంది. ఏపీలోని ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన ఓ మహిళ 150 మద్యం దుకాణాలకు దరఖాస్తు చేసింది. ఆమె ఏపీకి సరిహద్దు జిల్లాల్లోని షాపులకు ఎక్కువగా దరఖాస్తులు చేసిందని అధికారులు చెబుతున్నారు. యూపీ, కర్ణాటక, ఒడిశా నుంచి కూడా చాలా మంది మహిళలు అప్లై చేసుకున్నారు. ఈనెల 23న లైసెన్స్‌ల కోసం డ్రా నిర్వహించనున్నారు.
Comments