కమ్యూనిటీ బయింగ్: 186 కార్లకు ₹21 కోట్ల డిస్కౌంట్!
షాపింగులో బల్క్‌గా కొంటే ఏమైనా తగ్గిస్తారా అని బేరమాడటం చూస్తుంటాం. గుజరాత్‌లోని జైన్ కమ్యూనిటీ సభ్యులు దీనిని వేరే లెవల్‌కు తీసుకెళ్లారు. ఏకంగా 186 లగ్జరీ కార్లను ఒకే డీల్‌లో కొనుగోలు చేసి అందరి దృష్టినీ ఆకర్షించారు. ఈ కార్ల విలువ ₹149.54 కోట్లు కాగా, వారు రూ.21.22 కోట్లు డిస్కౌంట్ పొందడం విశేషం. ఒకే కమ్యూనిటీకి చెందినవారు ఇంత పెద్ద మొత్తంలో ఒకేసారి లగ్జరీ కార్లను కొనడం దేశంలోనే చర్చనీయాంశమైంది.
Comments