• Oct 27, 2026
  • NPN Log

    మన శరీరంలో కీలక ఖనిజ లవణమైన క్యాల్షియం దృఢమైన దంతాలు, ఎముకలు, కండర పనితీరు, నాడీ సంకేతాలకు కీలకం. క్యాల్షియం మోతాదు తగ్గినప్పుడు సంబంధిత ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి ఈ పోషకాన్ని క్షీణింపజేసే ఆహార పదార్థాల మీద ఓ కన్నేసి ఉంచాలి. అవేంటంటే...

    సాఫ్ట్‌ డ్రింక్స్‌: శీతల పానీయాల్లో ఫాస్ఫారిక్‌ యాసిడ్‌ ఉంటుంది. ఇది క్యాల్షియం శోషణకు అడ్డుపడుతూ, ఎముకల్లో క్యాల్షియం మోతాదులను తగ్గించేస్తుంది. కాబట్టి ఎముకల ఆరోగ్యం కోసం శీతల పానీయాలకు దూరంగా ఉండాలి.

     

    రెడ్‌ మీట్‌/ప్రాసెస్డ్‌ మీట్‌: సాసేజ్‌, బేకన్‌, హాట్‌ డాగ్స్‌ లాంటి ప్రాసెస్డ్‌ మీట్‌తో పాటు రెడ్‌ మీట్‌ తీసుకున్నప్పుడు, యూరిక్‌ యాసిడ్‌ మోతాదులు పెరిగి, ఎముకల ఆరోగ్యం దెబ్బతింటుంది. ఈ పదార్థాలన్నీ క్యాల్షియం శోషణకు అడ్డుపడతాయి. కాబట్టి వీటిని పరిమితం చేయాలి.

    స్వీట్స్‌/బేక్‌ చేసిన పదార్థాలు: కేక్స్‌, క్యాండీస్‌, స్వీట్లు, బిస్కెట్లు అత్యధిక చక్కెర, శుద్ధి చేసిన పిండిపదార్థాలను కలిగి ఉంటాయి. ఇవన్నీ క్యాల్షియం శోషణను కుంటు పరుస్తాయి. అదనంగా వీటితో శరీరంలో ఇన్‌ఫ్లమేషన్‌ పెరుగుతుంది. దాంతో ఎముకలు బలహీనపడతాయి.

    టీ/కాఫీలు: వీటిలోని కెఫీన్‌ కూడా క్యాల్షియం శోషణను అడ్డుకుంటుంది. కాబట్టి వీటిని పరిమితం చేయాలి.

    మద్యం: మద్యం ఎముకల ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుంది. దాంతో ఎముకలు సులభంగా విరుగుతాయి. ఎముకలు దృఢంగా ఉండాలనుకుంటే మద్యానికి దూరంగా ఉండాలి.

    నూనె పదార్థాలు: వేయించిన చికెన్‌, సమోసాలు, పకోడీలు ఎముకలకు హానికరం. వీటిలోని అనారోగ్య కొవ్వులు క్యాల్షియం శోషణ మీద ప్రతికూల ప్రభావాన్ని కనబరిచి, ఎముకలను బలహీనపరుస్తాయి. కాబట్టి వీటిని పరిమితంగా తీసుకోవాలి.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement