కొరియా ఓపెన్ బరిలో ప్రణయ్
సువాన్ (కొరియా): నిలకడలేమి ఆట తీరుతో కొద్దికాలంగా ఇబ్బంది పడుతున్న భారత స్టార్ షట్లర్ హెచ్‌ఎ్‌స ప్రణయ్ కొరియా ఓపెన్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌కు సిద్ధమవుతున్నాడు. మంగళవారం నుంచి మొదలయ్యే ఈ టోర్నీ సింగిల్స్‌లో ప్రణయ్‌తో పాటు యువ షట్లర్ ఆయుష్ శెట్టి, కిరణ్ జార్జ్ కూడా పోటీ పడనున్నారు. భారత స్టార్ డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ ద్వయం ఈ టోర్నీ బరిలో లేకపోవడంతో ప్రణయ్, ఆయు్‌షపైనే పతక అంచనాలు నెలకొన్నాయి. మహిళల సింగిల్స్‌లో అనుపమ ఉపాధ్యాయ, మిక్స్‌డ్ డబుల్స్‌లో మోహిత్, లక్షిత భారత్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నారు.
Comments