కశ్మీర్ క్రికెటర్ పర్వేజ్ రసూల్ రిటైర్మెంట్
న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్ నుంచి ప్రాతినిథ్యం వహించిన తొలి క్రికెటర్‌గా రికార్డుకెక్కిన పర్వేజ్ రసూల్ తన కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. క్రికెట్‌లో అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్టు 36 ఏళ్ల రసూల్ ప్రకటించాడు. కుడిచేతివాటం ఆఫ్‌స్పిన్నర్‌గా 2014లో జాతీయ జట్టులో అరంగేట్రం చేసిన రసూల్ ఒకే ఒక వన్డే మ్యాచ్ ఆడాడు. బంగ్లాదేశ్‌తో ఆడిన ఆ మ్యాచ్‌లో పది ఓవర్లలో 60 పరుగులిచ్చి రెండు వికెట్లు తీశాడు. ఇక, ఒకే ఒక టీ20ని 2017లో ఇంగ్లండ్‌తో ఆడాడు. ఆ మ్యాచ్‌లో 5 పరుగులు చేసిన అతను ఒక వికెట్ పడగొట్టాడు. ఇక, ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో బెస్ట్ ఆల్‌రౌండర్‌గా పేరు తెచ్చుకున్న రసూల్ 5,648 పరుగులు చేయడంతో పాటు 352 వికెట్లు పడగొట్టాడు. జాతీయ జట్టుకే గాకుండా ఐపీఎల్ తరఫున ప్రాతినిథ్యం వహించిన తొలి కశ్మీర్ క్రికెటర్‌గానూ రసూల్ నిలిచాడు. పుణె వారియర్స్, బెంగళూరు, సన్‌రైజర్స్ జట్లకు ఆడిన రసూల్ 11 మ్యాచుల్లో 4 వికెట్లు తీశాడు.
Comments