గిరిజనులకు 89,845 దోమతెరలు: సత్యకుమార్
ఆంధ్ర ప్రదేశ్ : అల్లూరి, మన్యం జిల్లాల్లో మలేరియా ఇతర జ్వరాల వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 743 గ్రామాల్లోని గిరిజన కుటుంబాలకు 89,845 దోమతెరలను ఉచితంగా అందిస్తామని మంత్రి సత్యకుమార్ యాదవ్ చెప్పారు. దీనివల్ల 2 లక్షల మందికి ప్రయోజనం చేకూరుతుందన్నారు. ఇందుకు రూ.2.30 కోట్లు ఖర్చవుతుందని చెప్పారు. దోమలను సంహరించే మందును ఉపయోగించి తయారు చేసే ఈ దోమతెరలను 4 ఏళ్లవరకు వినియోగించొచ్చని తెలిపారు.










Comments