‘గోల్డెన్ గ్లోబ్’ వేడుకల్లో ప్రియాంక మెరుపులు
అంతర్జాతీయ వేదికపై మరోసారి భారతీయ సినీ స్టార్ మెరిశారు. గతంలో ఆస్కార్ వేడుకల్లో దీపికా పదుకొణె ప్రత్యేక ఆకర్షణగా నిలవగా తాజాగా జరుగుతున్న గోల్డెన్ గ్లోబ్ ఈవెంట్‌కు ప్రియాంకా చోప్రా హాజరయ్యారు. బ్లూడ్రెస్‌లో రెడ్ కార్పెట్‌పై హొయలు పోయారు. తన భర్త నిక్ జోనస్‌తో కలిసి ఫొటోలకు పోజులిచ్చారు. కాగా 2023లో RRR ‘నాటు నాటు’ పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కింది.










Comments