టారిఫ్‌ల తగ్గింపు కోసం అమెరికా కు 350 బిలియన్లుడాలర్లు చెల్లించనున్న ద.కొరియా
టారిఫ్‌ల తగ్గింపు కోసం తమకు 350బిలియన్లు డాలర్లు చెల్లించేందుకు ద.కొరియా ఒప్పుకుందని అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ వెల్లడించారు. ఇరు దేశాల మధ్య ట్రేడ్ డీల్ జరిగిందన్నారు. అమెరికా నుంచి ఆయిల్, గ్యాస్‌ను భారీ మొత్తంలో కొనేందుకు కూడా ద.కొరియా అంగీకరించిందని తెలిపారు. ఆ దేశ కంపెనీలు అమెరికా లో పెట్టే పెట్టుబడుల విలువ $600 బిలియన్లు ను మించిపోతుందన్నారు. అణుశక్తితో నడిచే జలాంతర్గామి నిర్మాణానికి వారికి అనుమతినిచ్చినట్లు చెప్పారు.








Comments