తెలంగాణలో తగ్గిన పప్పు దినుసుల సాగు
తెలంగాణ : రాష్ట్రంలో ఈ ఏడాది పప్పు దినుసుల సాగు విస్తీర్ణం తగ్గింది. గత ఏడాది 8,25,236 ఎకరాల్లో పప్పు దినుసులను సాగు చేయగా.. ఈ ఏడాది 5,83,736 ఎకరాలకే పరిమితమైంది. వర్షాభావ పరిస్థితులు, ధరల్లో హెచ్చుతగ్గులు, మార్కెటింగ్ సమస్యలు, పంట రవాణా వ్యయం పెరుగుదల, నిల్వ వసతులలేమి కారణంగా ఈ పంటల సాగు విస్తీర్ణం తగ్గినట్లు తెలుస్తోంది. పప్పు దినుసుల్లో కందులు, పెసలు, మినుములను రాష్ట్రంలో ఎక్కువగా సాగు చేస్తున్నారు.
Comments