ధరలు పైపైకి..
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో సంక్షోభంతో పెరిగిన ఇంధన రేట్లు ఆహార ధరలతో పాటు మొత్తం మార్కెట్ ఉత్పత్తులపై ప్రభావం చూపుతున్నాయి. ఈ ఏప్రిల్‌లో 3.48 శాతంగా నమోదైన వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం.. ఇంధన పోటుతో మరింత ఎగబాకి మే నెలలో 3.93 శాతానికి చేరింది. రిటైల్ ద్రవ్యోల్బణం పెరగడం వరుసగా ఇది ఐదో నెల. జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్‌ఎ్‌సఓ) శుక్రవారం విడుదల చేసిన డేటా ప్రకారం.. గత నెలలో ఆహార ధరల ద్రవ్యోల్బణం 4.78 శాతానికి ఎగబాకింది. ఏప్రిల్‌లో 4.2 శాతంగా ఉంది. రిటైల్ ద్రవ్యోల్బణాన్ని 4 శాతానికి (+/- 2 శాతం) కట్టడి చేయాలని కేంద్రం ఆర్‌బీఐకి లక్ష్యాన్ని నిర్దేశించింది.
గత నెలలో విలువైన లోహాల ఆభరణాలు, టొమాటో, అల్లం, కిస్మిస్ ధరల్లో అత్యధిక పెరుగుదల నమోదైంది. బంగాళ దుంపలు, బటానీలు, మోటార్ కార్, జీప్, జీలకర్ర, మోటార్ సైకిల్, స్కూటర్ ధరలు మాత్రం తగ్గాయి.
గత ఏడాది మే నెలతో పోలిస్తే పెట్రోల్ రేటు 7.4 శాతం, డీజిల్ 8.4 శాతం పెరిగింది.
రాష్ట్రాలవారీగా చూస్తే, గత నెలలో అత్యధిక ద్రవ్యోల్బణం తెలంగాణలో 6.15 శాతంగా నమోదైంది. అత్యల్పంగా మిజోరాంలో 1.03ు ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో 4.90ు నమోదైంది.









Comments