నకిలీ ట్రేడింగ్ యాప్ ద్వారా రూ.30.17 లక్షలు స్వాహా
హైదరాబాద్ సిటీ: నకిలీ ట్రేడింగ్ యాప్ ద్వారా పెట్టుబడిదారుడిని ఆకర్షించి రూ.30.17 లక్షలు దోచేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఎఫ్‌ఐఆర్‌లో పొందుపర్చిన వివరాల ప్రకారం.. కొండాపూర్ రాఘవేంద్ర కాలనీ వాసికి ఆన్‌లైన్‌లో పరిచయమైన వ్యక్తులు ‘ఐక్య ఇనిస్టిట్యూషనల్ ట్రేడింగ్ అకౌంట్’ పేరుతో నడుస్తున్న ప్లాట్‌ఫామ్‌లో పెట్టుబడులు పెడితే భారీ లాభాలు వస్తాయని నమ్మించారు.
అతడితో పలు ఖాతాల్లో డబ్బులు జమ చేయించుకున్నారు. తనకు లాభాలు వచ్చినట్లు వర్చువల్‌గా కనిపించడంతో వాటిని విత్‌డ్రా చేసే ప్రయత్నం చేశాడు. అవకాశం లేకపోవడంతో మోసపోయానని గుర్తించి సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ట్రేడింగ్ మోసంలో తాను రూ.30.17 లక్షలు నష్టపోయినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. పోలీసులు కేసు దర్యాప్త చేస్తున్నారు.










Comments