పేకాట స్థావరంపై మొగుళ్ళపల్లి పోలీసుల ఆకస్మిక దాడి -11 మంది పేకాటరాయుళ్ల అరెస్ట్ -రూ. 29,410 నగదు నగదు, 8 టూవీలర్ వెహికల్స్ స్వాధీనం -మొగుళ్ళపల్లి ఎస్ఐ బోరగాల అశోక్
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పర్లపల్లి గ్రామ శివారులో గల నిర్మానుష్యమైన ప్రదేశంలో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై దాడి చేసి, పేకాట జూదం ఆడుతున్న 11 మందిని అదుపులోకి తీసుకొని, వారి వద్ద నుండి రూ. 29,410 నగదుతో పాటు 8 టూవీలర్ వెహికల్స్ మరియు పేక ముక్కలను స్వాధీనం చేసుకోవడం జరిగిందని, పట్టుబడిన వారిని తదుపరి విచారణ నిమిత్తం మొగుళ్లపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేయడం జరిగిందని మొగుళ్లపల్లి ఎస్ఐ బోరగాల అశోక్ తెలిపారు. ఎస్ఐ అశోక్ కథనం ప్రకారం నమ్మదగిన సమాచారం మేరకు తనతో పాటు మొగుళ్లపల్లి పోలీసులు పేకాట స్థావరంపై ఆకస్మికంగా దాడి చేయగా..ఈ పేకాట జూదంలో 11 మంది నిందితులు దొరికారని, అందులో A-1 గా ఇల్లంతకుంట మండలంలోని బుజునూరు గ్రామానికి చెందిన ఎడ్ల మల్లారెడ్డి (58), A-2 గా సరికొమ్ముల ఓదేలు (45), A-3 గా ఇల్లంతకుంట మండలంలోని సీతంపేట గ్రామానికి చెందిన పెద్దోజు రమేష్ (42), A-4 గా చిలక శ్రీనివాస్ (42), A-5 గా చిలుక శ్రీను (34), A-6 గా మక్కపెల్లి శేఖర్ (28), A-7 గా పాత తిరుపతి (39), A-8 గా గుండ్ల లక్ష్మయ్య (50), A-9 గా పిట్టల రమేష్ (43), A-10 గా పిట్టల రాజేష్ (30), A-11 గా పిట్టల రమేష్ (33)లను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశామని, అదేవిధంగా పేక ముక్కలను, 8 టూ వీలర్ వెహికల్ లను స్వాధీనం చేసుకోవడం జరిగిందని ఆయన తెలిపారు.
Comments