ప్రతిపక్షంలో బీఆర్ఎస్.. 97.4% తగ్గిపోయిన విరాళాలు
తెలంగాణ : అధికారం కోల్పోగానే బీఆర్ఎస్ కు వచ్చే విరాళాలు భారీగా తగ్గిపోయాయి. ఈసీకి బీఆర్ఎస్ సమర్పించిన ఆడిట్ రిపోర్ట్ ప్రకారం 2024–25లో రూ.15.09 కోట్లు మాత్రమే విరాళాలుగా వచ్చాయి. ప్రోగ్రెసివ్ ఎలక్టోరల్ ట్రస్ట్ నుంచి ₹10 కోట్లు, ప్రుడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్ నుంచి ₹5 కోట్లు అందాయి. 2023–24లో ఎలక్టోరల్ బాండ్ల ద్వారా కారు పార్టీకి రూ.580.52 కోట్లు రాగా ఈసారి ఏకంగా 97.4% తగ్గిపోవడం గమనార్హం.










Comments