బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..
మంగళవారం నాడు బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల నమోదైంది. అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ కారణాల నేపథ్యంలో బంగారం ధరలు హెచ్చు తగ్గులకు లోనవుతున్నాయి. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు తగ్గడం, డాలర్ బలపడడం మొదలైన కారణాలతో పసిడి ధరలు క్రమంగా తగ్గుతున్నాయి.
గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, మంగళవారం ఉదయం 6.30 గంటల సమయంలో హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,56,210గా ఉంది. ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంటల్ బంగారం ధర రూ.1,43,190గా ఉంది. మరోవైపు దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,56,360గా ఉంది. ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంటల్ బంగారం ధర రూ.1,43,340గా ఉంది.
మరోవైపు వెండి ధరలు కూడా స్వల్ప తగ్గుదలను నమోదు చేశాయి. కిలోకు వంద రూపాయల మేర తగ్గాయి. ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడలో కిలో వెండి ధర రూ.2,89,900గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం కిలో వెండి ధర రూ.2,79,900గా ఉంది. అలాగే చెన్నైలో కిలో వెండి ధర రూ.2,89,900గా, బెంగళూరులో రూ.2,79,900గా ఉంది.
గమనిక: బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలను చెక్ చేసుకోవలసిందిగా సూచన.










Comments