• Jun 05, 2026
  • NPN Log

    కొత్త మోటోరోలా ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? మోటోరోలా కంపెనీ నుంచి రెండు సరికొత్త ఫోన్లు వచ్చేస్తున్నాయి. వచ్చే వారం భారత మార్కెట్లో లాంచ్ కానున్నాయి. మోటో G37, మోటో G37 పవర్‌ ఫోన్లలో మీడియాటెక్ డైమెన్సిటీ 6400 ప్రాసెసర్ ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లు ఏప్రిల్‌లో యూరప్‌లో లాంచ్ కానున్నాయి.

    మోటోరోలా ఇండియా ఎక్స్ వేదికగా మోటో G37, మోటో G37 పవర్ మే 19న లాంచ్ కానున్నాయని (Moto G37 Series) వెల్లడించింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లు ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ ఎంపిక చేసిన రిటైల్ స్టోర్‌ల ద్వారా అమ్మకానికి రానున్నాయి.

     

     

    ఈ స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్‌లను ఫ్లిప్‌కార్ట్‌లో రివీల్ చేశారు. అయితే, మోటో G37, మోటో G37 పవర్ ధరల సమాచారం ఇంకా అందుబాటులో లేదు.

     

     

     

    ఈ స్మార్ట్‌ఫోన్లు ఇతర అంతర్జాతీయ మార్కెట్లలో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌తో లాంచ్ అయ్యాయి. భారత మార్కెట్లో మోటో G37, మోటో G37 పవర్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 6400 చిప్‌సెట్ ఉంటుందని అంచనా.

     

     

    మోటోరోలా జీ27 సిరీస్ స్పెషిఫికేషన్లు :
    ఈ స్మార్ట్‌ఫోన్‌ ఇతర స్పెసిఫికేషన్లు, అంతర్జాతీయ వేరియంట్‌ల మాదిరిగానే ఉంటాయని భావిస్తున్నారు. మోటో G37లో 6.67-అంగుళాల HD+ LCD ప్యానెల్ ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్, 120Hz టచ్ శాంప్లింగ్ రేట్ 1,050 నిట్స్ టాప్ బ్రైట్‌నెస్ లెవల్ ఉన్నాయి.

    ఈ డిస్‌ప్లేకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ ఉంది. ఆండ్రాయిడ్ 16పై రన్ అవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్ మాలి-G57 జీపీయూ ఉన్నాయి. స్టోరేజ్‌ కోసం మైక్రో ఎస్‌డీ కార్డ్ ద్వారా 1TB వరకు పెంచుకోవచ్చు. మోటో G37లో 50MP ప్రైమరీ రియర్ కెమెరా లైట్ అండ్ ఫ్లిక్కర్‌తో ఇంటిగ్రేటెడ్ సెకండరీ కెమెరా ఉన్నాయి.

     

     

    ఈ స్మార్ట్‌ఫోన్‌లోని 5,200mAh బ్యాటరీ 20W టర్బోపవర్ ఛార్జింగ్, 6W వైర్డ్ రివర్స్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. సేఫ్టీ కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంది. మోటో G37 పవర్, మోటో G37 మాదిరిగానే అదే ఆపరేటింగ్ సిస్టమ్, డిస్‌ప్లే, చిప్‌సెట్ రియర్ కెమెరా యూనిట్‌తో వస్తుంది. మోటో G37 పవర్‌లో 7,000mAh బ్యాటరీ ఉంది. 30W టర్బోపవర్ 6W వైర్డ్ రివర్స్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది.

     

     

     

    ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. ఈ బ్యాటరీ 78 గంటల వరకు లైఫ్ అందిస్తుందని మోటోరోలా పేర్కొంది. ఇందులో డాల్బీ అట్మోస్‌కు సపోర్టు ఇచ్చే స్టీరియో స్పీకర్లు ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ కొలతలు 166.23 x 76.50 x 8.89mm బరువు సుమారుగా 215 గ్రాములు ఉంటుంది.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement