• Oct 27, 2026
  • NPN Log

    న్యూఢిల్లీ: హ్యుండయ్‌ మోటార్‌ ఇండియా లిమిటెడ్‌ (హెచ్‌ఎంఐఎల్‌) మార్కెట్లోకి కొత్త కారు బేయన్‌ను సోమవారం విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రుపాయలు.9.99 లక్షలు (ఎక్స్‌షోరూమ్‌)గా ఉంది. హ్యుండయ్‌ సబ్‌ 4 మీటర్‌ కాంపాక్ట్‌ ఎస్‌యువీ వెన, మిడ్‌ సైజ్‌ ఎస్‌యసువీ క్రెటా మధ్య ఈ మోడల్‌ను తీసుకువచ్చింది. మిడ్‌సైజ్‌ ఎస్‌యూవీ సెగ్మెంట్లో ఇది మారుతి సుజుకీ విక్టోరిస్‌తో పోటీ పడనుంది. బేయన్‌ కారులో 12.3 అంగుళాల డిస్‌ప్లేతో పాటు వెంటిలేటెడ్‌ ఫ్రంట్‌ సీట్లు, టస్టెప్‌ రిక్లైనింగ్‌ రియర్‌ సీట్లు, రియర్‌ ఏసీ వెంట్స్‌, పనోరమిక్‌ సన్‌రూ‌ఫ్, జెనరేటివ్‌ ఏఐ వాయిస్‌ అసిస్ట్‌ తదితర ఫీచర్లున్నాయి. భద్రతా ఫీచర్ల విషయఙూనికి వస్తే.. లెవల్‌ 2 అడాస్‌, ఆరు ఎయిర్‌బ్యాగులు, 360 డిగ్రీ కెమెరా, ఆల్‌ ఫోర్‌ డిస్క్‌ బ్రేక్‌లు, హిల్‌ఙ-స్టార్ట్‌ అసిస్ట్‌ కంట్రోల్‌, ఎలక్ర్టానిక్‌ స్టెబిలిటీ కంట్రోల్‌, టైర్‌ ప్రెజర్‌ వఙూనిటరింగ్‌ సిస్టమ్‌, ఎలక్ర్టానిక్‌ పార్కింగ్‌ బ్రేక్‌ విత్‌ ఆటో హోల్డ్‌ వంటివి ఉన్నాయి.1.5 లీటర్‌ నేచురల్లీ ఆస్పైర్డ్‌ పెట్రోల్‌ ఇంజన్‌. 6 స్పీడ్‌ మాన్యువల్‌ లేదా ఐవీటీ ఆటోమేటిక్‌తో ఇది అందుబాటులో ఉంది. బేయన్‌ మోడల్‌ను విడుదల చేసిన సందర్భంగా కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈఓ తరుణ్‌ గార్గ్‌ వఙూట్లాడుతూ.. ప్రస్తుతం హ్యుండయ్‌ మోటార్‌ ఇండియ వార్షిక స్థాపిత సామర్థ్యం 9,94,000 యఙూనిట్లు ఉందని, 2030 నాటికి ఇది 11.4 లక్షల యూనిట్లకు పెరుగుతుందని చెప్పారు.

     

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement