• Jun 05, 2026
  • NPN Log

    అమరావతి : మే నెలలో నికర జీఎస్టీ రూ.3037 కోట్లు వసూలైంది. 2026 మేలో అన్ని పన్నుల విభాగాల వసూళ్లు రూ.4950 కోట్లకు చేరుకున్నాయి. 2025 మేలో ఇవి రూ.4165 కోట్లు మాత్రమే. గతేడాది కంటే ఇప్పుడు 19 శాతం వృద్ధి నమోదైంది. ఇరాన్‌ యుద్ధం వల్ల ఏర్పడిన ప్రతికూల ఆర్థిక ప్రభావాలను తగ్గిస్తూ, పన్ను నిర్మాణాన్ని సరళీకృతం చేయడం, వ్యాపార నిర్వహణను సులభతరం చేయడం ద్వారా పన్ను వసూళ్లు పెరిగాయని రాష్ట్ర పన్నుల చీఫ్‌ కమిషనర్‌ అహ్మద్‌ బాబు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2025 మేలో నికర జీఎస్టీ రూ.2,629 కోట్లు రాగా, 2026 మేలో 16 శాతం వృద్ధి నమోదైంది. ఐజీఎస్టీ సెటిల్మెంట్‌ 15.36 శాతం వార్షిక వృద్ధితో రూ.1758.58 కోట్లు వసూలైంది. పెట్రోలియంపై వ్యాట్‌ 31.79 శాతం వార్షిక వృద్ధితో రూ.1768.82 కోట్లు వసూలైంది. వృత్తి పన్ను రూ.48.92 కోట్లకు పెరిగింది. దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటక 17 శాతం వృద్ధితో జీఎస్టీ వసూళ్లలో మొదటిస్థానంలో నిలవగా 16 శాతం వృద్ధితో ఏపీ రెండోస్థానంలో నిలిచింది.

     

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement