రాబోయే 2-3 గంటల్లో వర్షం
తెలంగాణ : నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో రాబోయే 2-3 గంటల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ 2 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, హైదరాబాద్, భూపాలపల్లి, జగిత్యాల, కరీంనగర్, ఆసిఫాబాద్, మేడ్చల్, మంచిర్యాల, పెద్దపల్లి, సిరిసిల్ల, రంగారెడ్డి, సిద్దిపేట, యాదాద్రి జిల్లాల్లో తేలికపాటి వానలు పడే అవకాశం ఉందని పేర్కొంది. మీ ప్రాంతంలో వాన కురుస్తోందా?










Comments