• Jun 05, 2026
  • NPN Log

    వైవిధ్యమైన పాత్రలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి శోభితా ధూళిపాళ్ల  పుట్టినరోజు (May 31) సందర్భంగా ఆమె నటిస్తోన్న తమిళ చిత్రం ‘వేట్టువం’  నుంచి మేకర్స్ అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చారు. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ పా రంజిత్  మార్క్‌తో రాబోతున్న ఈ సినిమా నుంచి శోభితా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో శోభితా కంప్లీట్ బ్లాక్ కాస్ట్యూమ్‌లో, మెడలో విభిన్నమైన లాకెట్‌తో ఎంతో ఇంటెన్స్‌గా చూస్తూ కనిపిస్తోంది. ఆమె వెనుక దట్టమైన మేఘాలతో ఉన్న బ్యాక్‌గ్రౌండ్ సినిమాలోని సీరియస్ మూడ్‌ని ఎలివేట్ చేస్తోంది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  

    ఇటీవల ఈ సినిమా గురించి శోభితా ధూళిపాళ్ల మాట్లాడుతూ.. తన కెరీర్‌లోనే ఇదొక మైల్‌స్టోన్ మూవీగా నిలిచిపోతుంది, అంత అద్భుతమైన పాత్రను పోషిస్తున్నానని తెలిపారు. గత చిత్రాలకు భిన్నంగా ఇందులో ఒక సరికొత్త క్రేజీ అవతార్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు చెప్పారు. విభిన్న కాలాల నేపథ్యంలో సాగే ఒక అపోకలిప్టిక్ సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్‌తో పాటు, హై-వోల్టేజ్ యాక్షన్ అండ్ డ్రామా కలయికతో ఈ కథాంశం ఎంతో వినూత్నంగా ఉండబోతుందని ఆమె హింట్ ఇచ్చారు. ఇప్పుడొచ్చిన ఆమె ఫస్ట్ లుక్ కూడా అదే తెలియజేస్తోంది.

     

    ఈ క్రేజీ ప్రాజెక్టును నీలం ప్రొడక్షన్స్, లెర్న్ అండ్ టీచ్ ప్రొడక్షన్ సంస్థలు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలో ఆర్య, విఆర్ దినేష్ ముఖ్య పాత్రల్లో నటిస్తుండగా.. టాలెంటెడ్ కంపోజర్ జీవీ ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు. పా రంజిత్ మార్క్ టేకింగ్, శోభితా ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ తో రాబోతున్న ఈ 'వేట్టువం' మూవీ ఖచ్చితంగా బాక్సాఫీస్ వద్ద సరికొత్త ట్రెండ్ సెట్ చేస్తుందని చిత్రయూనిట్ ధీమాగా ఉంది.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement