వెండి నగలు కొంటున్నారా?
బంగారం ధరలు ఆకాశాన్నంటుతుండటంతో చాలామంది వెండి నగలు కొనేందుకు మొగ్గుచూపుతున్నారు. అయితే వెండి కొనే విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. బంగారంలానే వెండికీ BIS 92.5% హాల్‌మార్కింగ్ ఉంటుంది. వెండి స్వచ్ఛతకు 80, 83.5, 92.5, 95.8, 99, 99.9 గ్రేడ్స్ ఉన్నాయి. 92.5తోనే ఆభరణాల్ని ఎక్కువగా చేస్తారు. హాల్‌మార్కింగ్ లేదా క్రెడిబిలిటీ ఉండి, సర్టిఫికెట్ ఇచ్చే షాపుల్లోనే కొనడం మంచిది.









Comments