వరద ప్రాంతాల్లో రేపు సీఎం పర్యటన
తెలంగాణ : మొంథా తుఫానుతో భారీ వర్షాలు పడి వరద పోటెత్తిన వరంగల్, హుస్నాబాద్ ప్రాంతాల్లో సీఎం రేవంత్ రేపు ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. నేడు వరంగల్ పర్యటనకు ఆయన వెళ్లాల్సి ఉన్నా ప్రతికూల వాతావరణంతో వాయిదా పడింది. తుఫాను ప్రభావిత జిల్లాల్లో ఇన్‌ఛార్జ్ మంత్రులు క్షేత్రస్థాయిలో పర్యటించి బాధితులకు భరోసా ఇవ్వాలని సీఎం సూచించారు. ప్రజలను ఆదుకునేందుకు అన్ని ప్రణాళికలను సిద్ధం చేస్తున్నామని చెప్పారు.









Comments