వివో నుంచి 2 కిర్రాక్ ఫోన్లు.. మే 6నే వచ్చేస్తున్నాయ్..
కొత్త వివో ఫోన్ కోసం చూస్తున్నారా? వివో నుంచి రెండు సరికొత్త ఫోన్లు రాబోతున్నాయి. వివో అల్ట్రా మోడల్ ఎఫ్ఈ వేరియంట్‌తో పాటు భారత మార్కెట్లో లాంచ్‌కు రెడీగా ఉంది. వివో X30 అల్ట్రా, వివో X300 ఎఫ్ఈ రెండూ మే 6న మధ్యాహ్నం 12 గంటలకు భారత మార్కెట్లో లాంచ్ కానున్నాయి.
అద్భుతమైన పర్ఫార్మెన్స్, ఆకట్టుకునే కెమెరా ఫీచర్లతో వస్తుందని అంచనా. ఫ్లాగ్‌షిప్-లెవల్ పర్ఫార్మెన్స్ డిజైన్‌తో జైస్-ట్యూన్డ్ కెమెరా ఈ కంపెనీ ఇప్పటికే ధృవీకరించింది. ఈ ఫోన్ల గురించి ఇతర వివరాలు ఇంకా రివీల్ చేయలేదు. స్పెసిఫికేషన్లు, ధరకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
వివో X300 అల్ట్రా X300 ఎఫ్ఈ స్పెసిఫికేషన్లు :
వివో X300 అల్ట్రాలో 144Hz రిఫ్రెష్ రేట్ 5,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో 6.82-అంగుళాల 2K ఎల్టీపీఓ అమోల్డ్ ప్యానెల్ ఉంటుందని చెబుతున్నారు. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. 6,600mAh బ్యాటరీ, 100W వైర్డ్ 40W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండవచ్చు. కెమెరా విషయానికొస్తే.. వివో X300 అల్ట్రాలో గింబల్ OISతో 200MP మెయిన్ సెన్సార్, ఎక్స్‌ట్రీమ్ జూమ్ షాట్‌ల కోసం 200MP పెరిస్కోప్ లెన్స్ ఉండవచ్చు. ఈ డివైజ్‌కు IP68/IP69 రేటింగ్‌లు, ఆండ్రాయిడ్ 16 కూడా ఉండొచ్చు.
వివో X300 ఎఫ్ఈ ఫోన్ 6.31-అంగుళాల 1.5K ఎల్టీపీఓ అమోల్డ్ డిస్‌ప్లే, 5,000 నిట్స్ బ్రైట్‌నెస్‌తో వస్తుందని అంచనా. ఈ వివో ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 చిప్ 90W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 6,500mAh బ్యాటరీ ఉండవచ్చు. కెమెరా విషయానికొస్తే.. ఈ వివో ఫోన్ 50MP మెయిన్ సెన్సార్, 50MP పెరిస్కోప్ లెన్స్ ఉండవచ్చు. ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌తో వస్తుంది.
భారత్‌లో వివో X300 అల్ట్రా వివో X300 ఎఫ్ఈ ధర (అంచనా) :
భారత మార్కెట్లో రాబోయే ఈ వివో ఫోన్ ధర ఇంకా రివీల్ చేయలేదు. లీకుల ప్రకారం.. వివో X300FE ధర సుమారు రూ. 70వేలు, వివో X300 అల్ట్రా ధర సుమారు రూ. 1,30,000 వరకు ఉండవచ్చు.










Comments