వైసీపీ మాత్రమే అమరావతిని వ్యతిరేకిస్తోంది: మంత్రి అనగాని
బాపట్ల జిల్లా : ప్రపంచంలో తెలుగువారంతా గర్వించే నగరం అమరావతి అని ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ వ్యాఖ్యానించారు. దేశంలోని అన్ని పార్టీలు అమరావతినే రాజధానిగా కావాలన్నారని పేర్కొన్నారు. ఒకే ఒక్క వైసీపీ మాత్రం అమరావతిని వ్యతిరేకిస్తోందని ధ్వజమెత్తారు. రాజధాని రైతుల పాదయాత్ర ఈ ప్రాంతం గుండా వెళ్లిందని చెప్పుకొచ్చారు. అప్పుడు రైతులకు తాము మద్దతిచ్చామని అన్నారు. ఈరోజు (గురువారం) బాపట్ల జిల్లాలోని భట్టిప్రోలు మండలం సూరేపల్లిలో ఏర్పాటు చేసిన గ్రామసభకు మంత్రి అనగాని హాజరై మాట్లాడారు.
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌తో గందరగోళం..
జగన్ హయాంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌తో గందరగోళం చేశారని ఆగ్రహించారు. జగన్ ఫొటోతో ఉన్న పాస్ పుస్తకాలు మనకు అవసరమా అని ప్రశ్నించారు. రైతుల భూములను 21ఏ లో చేర్చి ఇబ్బందులకు గురి చేశారని ఫైర్ అయ్యారు. కూటమి అధికారంలోకి రాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశామని ప్రస్తావించారు. రైతులకు ఇబ్బంది లేకుండా పాసుపుస్తకాలు ఇస్తున్నామని చెప్పారు. వైసీపీ హయాంలో సరిహద్దు రాళ్లపై జగన్ బొమ్మలు వేశారని ఎద్దేవా చేశారు. రైతులు భూమిని ఆత్మగౌరవంగా భావించారని.. అందుకే కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారని అన్నారు. తుగ్లక్ పార్టీని మరోసారి అధికారంలోకి రాకుండా జనం చూడాలని మంత్రి అనగాని సత్యప్రసాద్ కోరారు.









Comments