స్పామ్ కాల్స్ రావొద్దంటే ఇలా చేయండి!
గత కొన్నేళ్లుగా స్పామ్ కాల్స్ విపరీతంగా పెరిగిపోయాయి. లోన్లు, క్రెడిట్ కార్డులు ఇస్తాం అంటూ పదేపదే కాల్స్ చేస్తూ విసిగిస్తున్నారు. అలాంటి కాల్స్ రాకుండా ఉండేందుకు ఇప్పటికే ట్రాయ్ DND (Do Not Disturb) అనే విధానం తీసుకొచ్చింది. 1909 నంబర్‌కు కాల్ లేదా SMS చేసి టెలిమార్కెటింగ్ కాల్స్ రాకుండా బ్లాక్ చేయవచ్చు. లేదా DND యాప్ నుంచి నేరుగా టెలి కమ్యూనికేషన్ విభాగానికి ఫిర్యాదు చేయవచ్చు.
Comments