దగ్గుబాటి వారు.. కోర్టుకు వచ్చి తీరాల్సిందే! నాంపల్లి కోర్టు ఆర్డర్స్
ఫిల్మ్ నగర్ లోని దక్కన్ కిచెన్ కూల్చివేత కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. నాంపల్లి కోర్టు లో గురువారం ఈ కేసుపై విచారణ జరిగింది. ఈ సందర్భంగా హీరోలు దగ్గుబాటి వెంకటేశ్, రానా, నిర్మాత సురేశ్‌బాబు, అభిరామ్ నవంబరు 14న తప్పని సరిగా న్యాయస్థానానికి రావాలని కోర్టు ఆదేశించింది. పర్సనల్ బాండ్ సమర్పించేందుకు హాజరు కావాల్సిందేనని స్పష్టం చేసింది. కోర్టు ఆదేశాలను ధిక్కరించి దక్కన్ హోటల్ కూల్చివేశారన్న ఆరోపణలతో వెంకటేశ్, రానా, సురేశ్‌బాబు, అభిరామ్‌పై గతంలో కేసు నమోదైన సంగతి తెలిసిందే.
దక్కన్ కిచెన్ కూల్చివేతపై ఫిల్మ్‌నగర్‌లో ఆ సమయంలో పెద్ద దుమారం రేగిన విషయం తెలిసిందే. ఈ కేసు మళ్లీ విచారణ దశకు రావడంతో సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. నవంబర్ 14న దగ్గుబాటి కుటుంబ సభ్యుల హాజరు నేపథ్యంగా కేసు తదుపరి దిశలో ఏం జరుగుతుందన్నదే ఆసక్తికరంగా మారింది.
Comments