సుప్రీం ఆదేశాలు పట్టించుకోవట్లేదు: రాజ్‌దీప్
ఢిల్లీలో దీపావళి రోజున రాత్రి 8-10 గంటల మధ్య బాణసంచా కాల్చేందుకు సుప్రీంకోర్టు అనుమతించిన సంగతి తెలిసిందే. అయితే 11pm దాటినా అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలను పట్టించుకోకుండా టపాసులు కాలుస్తున్నారని ప్రముఖ జర్నలిస్టు రాజ్‌దీప్ సర్దేశాయ్ ట్వీట్ చేశారు. సుప్రీం ఆదేశాలను అమలు చేయడంలో వైఫల్యానికి ఢిల్లీ ప్రభుత్వం, పోలీసులు సమాధానం చెప్పాల్సి ఉందన్నారు. సుప్రీంకోర్టు కూడా వాస్తవాన్ని పరిశీలించాలని కోరారు.
Comments